- Advertisement -
హైదరాబాద్: మనం తీసుకునే ఆహారంలో స్వల్పమార్పులు చేసుకోవడం వల్ల పెనుమార్పులు సాధ్యమైతాయని ఎఫ్‌సీపీఎస్ ఎండీ (మెడ్) ప్రొపెసర్ డా. కేతన్ మెహతా పేర్కొన్నారు. ప్రాక్టీసింగ్ కార్డియో పల్మనాలజిస్ట్, డయాబెటాలిజిస్ట్‌గా నమ్మకమైన ఆసుపత్రిలో తన అనుభవం వెల్లడించడంతో పాటుగా చక్కటి ఎంపికలను చేసుకోవడంలో సంభాషణలు జరగాల్సిన అవశ్యకత ఉందన్నారు. మానవ శరీరానికి విభిన్నమైన పోషకాలు కావాల్సి ఉంటుందని, ఆరోగ్యవంతమైన సమతుల్యత కోసం ఇది తప్పసరిని, చాలావరకు వంట నూనెలల్లో కావాల్సిన పోషక పదార్దాలు ఉండవని తెలిపారు. మలేషియన్ పామాయిల్ కౌన్సిల్ వరుసగా పలు వినియోగదారుల అనుసంధానిత కార్యక్రమాలను ఆరోగ్య, పోషకాహార రంగంలో సుప్రసిద్ద వ్యక్తుల నేతృత్వంలో నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
- Advertisement -