హైదరాబాద్: బిజెపి నాయకురాలు నవనీత్ కౌర్ రాణా తన ప్రచారంలో భాగంగా ‘దేశంలో హిందూ-ముస్లిం నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి 15 సెకండ్ల సమయం ఇచ్చి చూడండి’ అని అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రతి సవాల్ విసరడంపై మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రతిస్పందించారు. ఆమెనెవరూ ఆపడంలేదని, ఎవరూ భయపడ్డం లేదని అసదుద్దీన్ అన్నారు.
‘‘ వారేమి చేస్తారు? ప్రధాని మోడీ కూడా అధికారంలో ఉన్నారు. 15 సెకెండ్లు ఏమిటి…గంట సమయం తీసుకోనివ్వండి. వారెందుకు అనుకున్నది ఆచరణలో పెట్టడం లేదు?’’ అన్నారు. ‘‘ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?ఎవరు మీకు భయపడుతున్నారు? మేము సిద్ధమే. ఎక్కడిక రమ్మంటారో చెప్పండి. అక్కడికి వస్తాం. మీకు ప్రధాని, ఆర్ఎస్ఎస్, ప్రతిదీ అనుకూలంగానే ఉంది’’ అని అసదుద్దీన్ అన్నారు.
మజ్లీస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు ప్రయోజనం అని ప్రధాని మోడీ అనడంపై కూడా అసదుద్దీన్ ప్రతిస్పందించారు. మోడీ ఆహ్వానం లేకుండా ఆప్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిశారని కూడా ఈ సందర్భంగా తెలిపారు.