Thursday, January 23, 2025

హెల్మెట్ రైడ్‌లో పాల్గొనండి… మీ హెల్మెట్‌లు పొందండి

- Advertisement -
- Advertisement -
  • పాల్గొన్న ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్ టౌన్: హెల్మెట్ రైడ్‌లో పాల్గొనండి.. మీ హెల్మెట్‌లు పొందండి, హెల్మెంట్‌లు ధరిచండి ప్రమాదాల్లో తొలగాయం నివారించండి అను కాన్సెప్ట్‌తో సంగారెడ్డిలోని హోప్ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం, ఖేడ్ సబ్ డివిజన్ పోలసుశాఖ ఆధ్వర్యం ఆదివారం ర్యాలీ నిర్వహించి హెల్మెట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల్లో జ్ఞానేంద్రియాలు నిలయం అయినా తలగాయం కాకుండా రక్షించుకోవచ్చన్నారు. నూతన సిసిలతో స్పోర్ట్ బైక్‌లు మార్కెట్‌లో చాలా వస్తున్నాయన్నారు.

వాటి మోజులో హెల్మెట్ ధరించక భవిష్యత్తుని శూన్యం చేసుకుంటున్నారన్నారు. మీ జీవితం మీ చేతుల్లో ఉంది హెల్మెట్ ధరించడం ప్రమాదాల్లో మిమ్ములను మీరు రక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి రాథోడ్‌లక్ష్మీబాయిరవీందర్‌నాయక్, ఎంపిపి తనయులు రమేష్‌చౌహాన్, నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షులు ప్రభాకర్‌కురుమ, డిఎస్పి వెంకట్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News