Monday, November 18, 2024

కుకీ విద్యావేత్తలపై కేసుల ఉప సంహరణకు చర్యలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: కుకీ విద్యావేత్తలపై దాఖలైన కేసుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవలసిందిగా కుకీలకు చెందిన అపెక్స్ సంస్థ కుకీ ఇంపి మణిపూర్( కెఐఎం) ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. కుకీ తెగకు చెందిన పలువురు విద్యావేత్తలు, రచయితలు, నేతలు నిరంతరం బెదిరింపులు, వేధింపులకు గురవుతున్నారని ప్రధానికి పంపిన వినతిపత్రంలో ఆ సంస్థ తెలిపింది. పరిశోధనాఫలితాలు, విద్యాపరమైన కార్యక్రమాలు, భావ ప్రకటనా స్వేచ్ఛను వెల్లడించడం లాంటి వాటిపై ఎఫ్‌ఐఆర్‌లు, కేసులతో స్పందిస్తున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్పిటీకి చెందిన ఇద్దరు కుకీ ప్రొఫెసర్లు, ఒక రిటైర్డ్ కలల్ ఆంగ్లోకుకీ యుద్ధం 1917 19పై రాసిన పుస్తకాన్ని ఎడిట్ చేసినందుకు వారిపై కేసులు పెట్టినట్లు ఆ సంస్థ తెలిపింది.

కుకీ విద్యావేత్తలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ఈ దేశంలో విద్యా పరమైన స్వేచ్ఛ ఏ స్థితిలో ఉందనే దానికి అద్దపడుతుంది.మా విద్యావేత్తలపై మోపిన అభియోగాలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవే కాకుండా కుకీ చరిత్రను తుడిచి వేయడానికిజరిపిన ప్రయత్నం. ఇదే కాకుండా వివిధ వేదికలపై కుకీ తెగ పక్షాన మాట్లాడిన కుకీ నేతలు, సామా.ఇక ఉద్యమ కార్యకర్తలు, విద్యాసంఘాలు, విద్యావేత్తలపైనా వారి నోళ్లు నొక్కే ప్రయత్నంలో భాగంగా వారిపై కేసులు పెడుతున్నారనిఆ సంస్థ పేర్కొంది. దురుద్దేశంతో మెయితీలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా కుకీ తెగకు చెందిన రచయితతు, విద్యావేత్తలు, స్కాలర్లపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. అంతేకాకుండా లేయలోని తిరుగుబాటు గ్రూపులు, వారికి మద్దతు ఇచ్చే వారిపై తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆ సంస్థ ప్రధానమంత్రిని కోరింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News