Monday, January 20, 2025

ప్రభుత్వ ఆసుపత్రులలో వంద శాతం సాధారణ డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ ఆసుపత్రులలో 100% సాధన డె లివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనప కలెక్టర్ జి. వీరారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. శనివారం ఆయన కాన్ఫరెన్స్ హాలులో వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై సమీక్షిస్తూ…

ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీలు, మాతా శిశు సేవలు పెలగాలని, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్‌గా పరీక్షలు నిర్వహించి వంద శాతం సాధారణ డెలివరీలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి చెకప్, ప్రపవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలని ఇందుకు గాను క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్‌ఎం సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,ప్రతి గర్భిణి స్త్రీకి టిఫా, డాప్లర్ అల్ట్రా సౌండ్ స్కా నింగ్ చేయాలని,చివరి త్రైమాసికంలో ప్రతి వారము పరీక్షలు చేయాలని, జిల్లాలో మాతృ మ రణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పూర్తి చేయాలని, డయాలసిస్ సెంటర్లలో ఆక్యుపెన్సి పెంచాలని ఆదేశించారు.

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. మల్లిఖార్జున రావు మాట్లాడుతూ,జిల్లాలో మాత శిశు సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్ష లు,100 శాతం సాధారణ కాన్పులు,వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పూర్తిగా సాధిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డా.పరిపూర్ణ చారి, డా. యశోద, డా. పాపారావు, డా. వినోద్, డా. సుమన్ కళ్యాన్, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సుపరిటెండెంట్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News