Wednesday, January 22, 2025

విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలో 26వ, 31వ వార్డులలో పర్య టించారు. 26, 31వ వార్డులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ప్రజలు తెలుపగా ప్రస్తుతం ఉన్న ఫీడర్ నుండి మార్చి మరో ఫీడర్ ద్వారా ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 26వ వార్డులో పాత స్థంబాలు తొలగించి, నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. 31 వ వార్డులో ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలని, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ కాలనీలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలలో రోడ్లు , తదితర అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News