Sunday, December 22, 2024

యాదగిరి గుట్ట క్షేత్రంలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఇకపై నిషిద్ధం!

- Advertisement -
- Advertisement -

భువనగిరి: తెలంగాణలోని యాదగిరిగుట్ట క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది ఈ యాదగిరి గుట్ట… యదాద్రిగా పిలవబడుతోంది. అయితే ఇకపై యాదగిరిగుట్ట పైన ఫొటోలు, వీడియోలు నిషేధం విధిస్తున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు ప్రకటించారు. స్వామీ వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రతిష్టకు… వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేదిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి చర్యలపై దేవస్థాన సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు ఆలయ ఈవో భాస్కర్ రావు. ఇక నుంచి కొండపైన భక్తులు తీసే ఫొటోలు, వీడియోలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని స్పష్టం చేశారు. దేవాలయ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News