Monday, December 23, 2024

తక్కశీల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తా

- Advertisement -
- Advertisement -

ఉండవల్లి : మండల పరిధిలోని తక్కశీల గ్రామంలో రూ. 15 క్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు , రూ. 5 లక్షలతో చర్చి ప్రహరీ గోడ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే డా.వి.ఎం. అబ్రహం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధ్ది చేస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంల జరగని అభివృద్ధ్ది కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కెసిఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News