Monday, December 23, 2024

చంద్రబాబుకు రూ.118 కోట్లు ఎలా వచ్చాయి: రంగయ్య

- Advertisement -
- Advertisement -

అనంతపురం: ఐటి నోటీసులపై టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి తలారి రంగయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు వద్ద ఉన్న రూ.118 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బు ముమ్మాటికీ అవినీతి సొమ్మే అని దుయ్యబట్టారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఐటి నోటీసులకు సమాధానం చెప్పకపోవడం బాధ్యతారాహిత్యమని ఎంపి తలారి మండిపడ్డారు. బాబు ఐటి నోటీసుల విషయంలో ఎల్లో మీడియా ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని తలారి చురకలంటించారు.

Also Read: బిజెపి దరఖాస్తుల స్వీకరణ… సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News