హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసమే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నామని, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రులను నిర్మించనున్నామన్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతలు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. దేశాన్నినడిపించే రాష్ట్రాలలో తెలంగాణ ముందు వరసలో ఉందని ప్రశంసించారు. ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిరుద్యోగ దీక్ష పేరిట బిజెపి డ్రామాలు ఆడుతోందని, దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్రమే శ్వేతపత్రం విడుదల చేయాలని తలసాని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతంగాన్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మేలు చేయడమే టిఆర్‌ఎస్ పని అని అన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉండి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షు కూడా విమర్శించే స్థాయికి దిగారని దుయ్యబట్టారు.