Thursday, January 23, 2025

అంబర్‌పేటకు కిషన్ రెడ్డి ఏం చేశారు: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభివృద్ధిపై చర్చకు బిజెపి, కాంగ్రెస్ సిద్ధమా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ అనడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అంబర్‌పేటకు 15 ఏళ్లు ఎంఎల్‌ఎగా కిషన్ రెడ్డి ఉన్నారని, కేంద్రమంత్రిగా అంబర్‌పేటకు కిషన్ రెడ్డి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దమ్ము బిజెపి నాయకులకు ఉందా? అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కుల, మతాల పేరుతో బిజెపి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News