Sunday, December 22, 2024

థియేటర్ల సమస్యలపై ఏపి మంత్రులతో మాట్లాడతా..

- Advertisement -
- Advertisement -

“రాష్ట్రంలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. చిన్న సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లలో 4 షోల నుండి 5 షోలకు పెంచడం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచాము”అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీ దేశంలోనే ఒక హబ్‌గా ఉండాలనేదే మా ఆకాంక్ష. అలాగే లొకేషన్స్‌లో పర్మిషన్ తీసుకోవటానికి సినిమా నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దానికి సంబంధించి సింగిల్ విండోను కూడా ఒకే చేశాము. సినిమాకు కులం మతం, ప్రాంతం అనేది ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్నిస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది. సినీ పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. ఇక ఏపిలో సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతాను. త్వరలోనే రాష్ట్రంలో ఆన్‌లైన్ టికెట్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదు. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది”అని అన్నారు.

Talasani reacts on AP Cinema Ticket Price Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News