Tuesday, December 24, 2024

స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేసిన తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani released fish in Station Ghanpur Reservoir

జనగాం: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రిజర్వాయర్ లో ఎంఎల్ఎ రాజయ్య, ఎంఎల్ సి బండ ప్రకాష్ లతో కలిసి మంత్రి చేప పిల్లలు విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్నామన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. చెరువులపై పూర్తి హక్కులు మత్స్య కారులవేనని తెలిపారు. దళారులకు చెరువులు అప్పగించి నష్టపోవద్దని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. చేప పిల్లల విడుదల పర్యవేక్షణ బాధ్యత మత్స్యకారులపైనే ఉందని తలసాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News