Friday, November 22, 2024

కులవృత్తుల పూర్వ వైభవం కోసం ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

Arrangements To Ganesh Immersion : Minister Talasani

సిద్దిపేట: సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం జిల్లాలో బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ లో చేప పిల్లలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ”ధ్వంసమైన కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శం. మత్స్యకారుల సంక్షేమానికే ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్నాం. ఈ సంవత్సరం రూ.115 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేప, 25 కోట్ల రొయ్య పిల్లల పంపిణీ చేశాం. 800 కోట్ల రూపాయల ఖర్చుతో మత్స్యకారులకు వివిధ వాహనాలు అందజేశాం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలి” అని మంత్రి అన్నారు.

Talasani releases fish seeds into Thotapalli Reservoir 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News