- Advertisement -
హైదరాబాద్: బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సమీక్ష నిర్వహించారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి నగరంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ బోనాలకు ప్రత్యేక విశిష్టత ఉందని తలసాని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నామమాత్రంగా ఉత్సవాలు నిర్వహించారని మంత్రి తలసాని వెల్లడించారు. జంట నగరాల్లో బోనాల ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు.
- Advertisement -