Sunday, January 12, 2025

17న మహాంకాళి బోనాల వేడుకలు: శ్రీనివాస్‌యాదవ్

- Advertisement -
- Advertisement -

Talasani review meeting on Ashada Bonalu

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో పాతబస్తీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయాం. ఈ నెలలో నిర్వహించే బోనాల వేడుకలను ఘనంగా జరపనున్నట్లు తెలిపారు. 17న సికింద్రాబాద్ మహాంకాళి, 24న పాతబస్తీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.18న మహాంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు గతంలో కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Talasani review meeting on Ashada Bonalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News