Friday, November 22, 2024

రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచానికే ఆదర్శం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచానికే ఆదర్శం
టిఎస్ బిపాస్ తో సులువైన పారిశ్రామల స్థాపనకు చర్యలు
దేశనికే తలమానికంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మోడల్
ఫుడ్ ప్రాసెసింగ్ లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది
పటిష్ట ల్యాండ్ ఆర్డర్ తో ఉరుకులు తీస్తున్న పారిశ్రామిక పురోగతి
400 కోట్లతో హ్యప్ పరిశ్రమ స్థపణతో 500 మంది స్థానికులకు ఉపాధి
హట్సాన్ చక్లెట్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ/జహీరాబాద్: ప్రపంచమే అబ్బురపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగతితో ముందుకు దూసుకెళ్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దురదృష్టితో అద్భుతమైన పురోగతి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర పశుపోషక సంవర్ధన సినీ ఆటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జహీరాబాద్ మండల పరిధిలోని గోవింద్ పూర్ గ్రామంలో గురువారం రూ.400కోట్లతో నూతనంగా నిర్మించిన చాక్లెట్ ప్లాంట్, హాట్సన్ పరిశ్రమ విస్తరణ ప్లాంట్ ప్రారంభోత్సవంలో భాగంగా హాట్సన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సి సత్యన్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులు మంత్రి తలసాని, విశిష్ట అతిధులుగా స్థానిక శాసన సభ సభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ పాల్గొన్నారు. హాట్సన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ ఎంపీ బిబి పాటిల్, జహీరాబాద్ మణిక్ రావులతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్లాంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పశుసంవర్ధక, సినీ ఆటోగ్రాఫి మంత్రి తలసని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ సమస్యను ఎదుర్కొంటు తెలంగాణ ప్రాంతానికి ఎంతో నష్టం చేకూర్చారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 24 గంటల కరెంట్ సరఫరా, పతిష్టమైమ ల్యాండ్ ఆర్డర్ తో దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో టిఎస్ బిపాస్ ను ప్రారంభించి కొద్దీ రోజుల వ్యవధిలోనే పరిశ్రమలు ప్రారంభించే ఔత్సాహికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ బ్యాంకును ప్రారంభించిందని, గతంలో ఉమ్మడి ప్రభుత్వలు ఉండటంతో విచ్చలవిడిగా అవినీతి, పైరవిలు ఉండేవని, ఇప్పుడు పరిశ్రమలు ప్రారంభించడానికి ఔత్సాహికులు ముందుకు వస్తే చాలని నేరుగా ప్రభుత్వమే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో తమ శాఖలు కలిగిన హాట్సన్ పరిశ్రమ యాజమాన్యం 400 కోట్లతో 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న హాట్సన్ పరిశ్రమను జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామంలో ఇంతపెద్ద పరిశ్రమ ప్రారంభించడానికి ముందుకు వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ సి సత్యన్ గారికి అభినందనలు తెలుపుతున్నని, భవిషత్తులో ప్రభుత్వం తరపున ఎలాంటి అవసరాలు ఉన్న తమ దృష్టికి తేవాలని, పరిశ్రమలో స్థానిక యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ ప్రారంభ కార్యక్రమనికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రావాల్సి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అత్యవసర సమావేశం కారణంగా రాలేకపోయారని, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో పరిశ్రామికరణ పెరుగుతుందని, పరిశ్రామికరణతో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని మంత్రి తలసాని అన్నారు.

Talasani Speech at Inauguration of Chocolate Plant in Zahirabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News