Saturday, November 2, 2024

తప్పును తప్పు అని చెప్పే వ్యక్తి మోహన్ బాబు: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డా.మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివక‌ృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి  కంగ్రాట్స్. విష్ణు యువకుడు. ఉత్సాహవంతమైన వాడు. ఆయన గెలుస్తాడు అని పది రోజుల ముందే చెప్పాను. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు, తర్వాత పెద్దలు మోహన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది ప్రముఖ నటులు చలనచిత్ర పరిశ్రమకు రావడం జరిగింది. మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువ. అయితే ఆయన కోపం ఆయనకే చేటు చేసిందికానీ, ఎవ్వరికీ చెడు చేయలేదు. తప్పును తప్పు అని చెప్పే వ్యక్తి. ధైర్యంగా తప్పును ప్రశ్నిస్తారు. అది ఆవేశం, కోపం అని వేరే వాళ్లు అనుకుంటారు. మనం చేయలేని పని తను చేసినప్పుడు, సమాజ హితువు కోసం మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత అంశాలు ఉండవు.  మోహన్ బాబు తన కొడుకు విష్ణుకు మంచి చదువు, సంస్కారం, క్రమశిక్షణను ఇచ్చారు. పెద్దలను గౌరవిస్తూనే మాట్లాడతారు. మా అసోసియేషన్ చిన్న వ్యవస్థ కాదు. 912 మంది ఫ్యామిలీలు ఉన్నాయంటే అది పెద్ద వ్యవస్థ. అలాంటి ‘మా’ అసోసియేషన్ కోసం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము” అని అన్నారు.

నరేష్ మాట్లాడుతూ..’‘మంచు’ కమిటీ.. మంచి కమిటీ. అనుభవం కలవారు ఉన్నారు. యువత, మహిళలకు పెద్ద పీట వేశారు. మంచి కమిటీ. మంచి మేనిఫేస్టో. అదే మన పనికి అద్దం పడుతుంది. పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు మీతోనే ఉంటుందని చెప్పే మేనిఫేస్టో. మా మెరుగుపెడాలని ఆరేళ్లగా కష్టపడుతున్నాం. మా సంక్షేమం కోసం ఎంతో పాటు పడ్డాం. కరోనాను కూడా ఎదుర్కొన్నాం. మా ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరిది. మా అనేది ఓ దిగ్గజం. మా అనేది కోహినూర్ వజ్రంలాంటిది. మేం అంతా అందులో భాగం. కచ్చితంగా ఈ కమిటీ అద్భుతాలను సాధిస్తుందని నమ్మకం ఉంది. మా మెరుగుపడింది. ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్షణం నుంచి మంచి మాత్రమే మైకులో మాట్లాడతాం. చెడు అంటే చెవిలో చెబుదాం. మా పదవి అనేది భుజకీర్తులు కావు.. బాధ్యత. పూర్వాధ్యక్షుడిగా, మెంబర్‌గా ‘మా’ను కచ్చితంగా అంటిపెట్టుకుని ఉంటాను. అందరి మన్నలను పొంది మంచు విష్ణు 106 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. దీన్ని గౌరవిద్దాం. అందరూ సమానమే. కానీ ప్రెసిడెంట్ అనేవారికి ఎక్కువగా గౌరవం ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇందులో రాజకీయం లేదు. మెరుగుపడిన ‘మా’ను ముందుకు తీసుకెళ్లేందుకు చేసిన పోరాటం. ప్రతీ క్షణం అధ్యక్షుడు మనతో ఉండలేరు. కానీ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇలా ఎంతో మంది ఉంటారు. ఎటువంటి సమస్యలున్నా హెల్ప్ లైన్ ఉంది వాడండి. కంప్లైంట్స్ బాక్స్ ఉంటుంది. నా ఫోన్ నంబర్ మీ దగ్గరుంది. ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. ‘మా’కు అన్నలా ఎప్పుడూ ఉంటాను. పదవుల కోసం ఉండను.. బాధ్యత కోసం ఉంటాను. ఆఖరి శ్వాస వరకు ‘మా’ కోసం ఉంటాను’ అని అన్నారు.

Talasani speech at MAA President Swearing Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News