Thursday, January 16, 2025

‘సమ్మతమే’ సూపర్ హిట్ కావాలిః మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani Speech at Sammathame pre release event

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే‘. చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. చిత్ర బృందంతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాసు, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని అందరూ చూసే విధంగా ‘సమ్మతమే’ అనే టైటిల్ పెట్టడం సంతోషించదగ్గ విషయం. హీరో కిరణ్ అబ్బవరంకి ఈ చిత్రంతో మరింత పేరు వస్తుంది.

ఈ చిత్రం సూపర్ హిట్ కావాలి”అని పేర్కొన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “సమ్మతమే చిత్రం గీతా ఆర్ట్‌లో విడుదల చేయడానికి ముఖ్య కారణం కిరణ్. మా గీతా ఆర్ట్‌కు అతను సొంత మనిషి. చాందిని లక్కీ హ్యాండ్‌”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “సినిమా తీయడం ఒక ఛాలెంజ్ అయితే ప్రేక్షకులని థియేటర్‌కి రప్పించడం మరో ఛాలెంజ్‌గా పరిస్థితి నెలకొంది. ఈ సినిమాకి హాయిగా ప్రమోషన్స్ చేసుకొని ఊరూరా తిరిగాను. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసులకు రుణపడి వుంటాను”అని తెలిపారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ “కథ రాస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మాణం కూడా చేయడం అంత సులువుగా ఉండదు. ఇది సాధ్యం కావడానికి మా సిస్టర్ సౌమ్య సహకరించింది. కిరణ్ ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు”అని చెప్పారు.

Talasani Speech at Sammathame pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News