Monday, December 23, 2024

సినీ కార్మికుల ఆందోళన… రెండు వర్గాలకు న్యాయం జరగాలి: తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నిర్మాతలు, కార్మిక నాయకులు పంతాలు, పట్టింపులకు పోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సినీ కార్మికుల వేతనాల పంచాయతీ మంత్రి తలసాని శ్రీనివాస్ వద్దకు చేరింది. నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ నాయకులతో తలసాని వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయని, కరోనా కారణంగా సినీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. మధాహ్నం 12 గంటలకు ఇరువర్గాలు భేటీ కావాలని చెప్పామన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మంత్రి సూచించామన్నారు. ఇరు వర్గాలు షూటింగ్‌లపై రెండు రకాలుగా మాట్లాడుతున్నారని, రెండు వర్గాలకు న్యాయం జరగాలన్నారు.

రెండో రోజు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండాలని సినీ కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. సినీ కార్మికులు ఆందోళన చేయడంతో 25పైగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే చర్చలు జరుపుతామని ఫిలింనగర్ చాంబర్ వెల్లడించింది. 15 రోజుల పాటు పాత పద్దతిలోనే చెల్లించాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News