Monday, December 23, 2024

ఈనెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈనెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావిని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ”చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో మెట్లబావి పునరుద్దరణ జరుగుతుంది. మెట్లబావి పరిసరాలను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం” అని పేర్కొన్నారు.

Talasani Srinivas inspects Bansilalpet metla bavi works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News