Sunday, December 22, 2024

ప్రతిపక్షాలు కళ్లున్న కబోదులు: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని, అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  సిద్దిపేటలో పి.వి. నరసిహావరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయానికి మంత్రులు మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. గతంలో లక్షా 37 వేళ ఉద్యోగాలు ఇచ్చామని, మళ్ళీ 97 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటానికి నెటీ పచ్చని తెలంగాణే సమాధానమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, ప్రజలు వాస్తవాలు గుర్తించాలన్నారు. గోళ్లకుర్మలు, మత్సకారుల అభివృద్ధిని తెలంగాణలో మనం ఊహించామా? అని తలసాని శ్రీనివాస్ అడిగారు.

Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాజస్థాన్ తో కీలక పోరు

2014 ముందున్న గోసను నిర్మూలించామని అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నామని కొనియాడారు. తెలంగాణలో 24 గంటల నిరంతారాయ కరెంట్ ఇస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కారెంట్ లేదన్నారు. ఇన్నేళ్ల గత పాలకులు గోళ్లకుర్మలు, రైతులు, మహిళల పాట్లు తీర్చారా ? అని తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా? అని అడిగారు. ప్రతిపక్షాలు కళ్ళున్నా చూడలేని కబోదుల్లా మారారని దుయ్యబట్టారు. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News