ఎన్నికల వేళ సనత్‌నగర్‌లో రసవత్తర రాజకీయం..!
కొందరి కార్యకర్తల వ్యవహార శైలితో తలసానికి తలనొప్పులు!
మన తెలంగాణ/ సిటీ బ్యూరో: సనత్‌నగర్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తంగా సాగనున్నాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలాగే కనిపిస్తోంది. సనత్‌నగర్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌నే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరావు ప్రకటించగా, కాంగ్రెస్, బిజెపి, టిటిపి పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయనున్నరన్నది ఇంకా తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి పోటీ చేయగా, ప్రస్తుతం ఆయన బిజెపిలో చేరడమే కాకుండా ఈ సారీ ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే తన తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు మర్రి శశీధర్ రెడ్డి కుమారుడు మర్రి అదిత్యా రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి కొడుకు చేరో పార్టీ నుంచి పోటీకి దిగే అవకాశం ఉండడంతో అందరు నియోజకవర్గంపైనే దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు గెలుపొందిన మంత్రి తలసాని శ్రీనివాస్ బిఆర్‌ఎస్ ను మూడోసారి పోటీ చేయబోతుండగా, రాజకీయాల్లో తల పండిన తండ్రి బిజెపి నుంచి, ఇప్పుడిప్పుడే రాజకీ య ఓనమాలు నేర్చుకుంటున్న కొడుకు కాంగ్రెస్ నుంచి బరీలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళా తండ్రి,కోడుకులు పోటీకి దిగితే ఎన్నికల ప్రచారం ఏలా ఉండబోనుందని అసక్తి రేపుతోంది.
తలసానికి వ్యతిరేకత తప్పకపోవచ్చు?
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు వరసగా గెలుపొందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సహాజగానే కొంత వ్యతిరేఖత తప్పని పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన అభివృద్ధ్ది పనులతో పాటు పేదల సంక్షేమమే లక్షంగా అమలు చేసిన పథకాలనే ఆయన నమ్ముకుని ఈ నియోజకవర్గంలో ముం దుకు పోతున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో టిడిపి నుంచి గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యా దవ్ ఆతర్వాత బిఆర్‌ఎస్‌లో చేరడం ఆ వెంటనే ఆయనను మంత్రి పదవి వరణించడం జరిగిపోయింది.
2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆయన బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఆ యన గెలువడమే కాకుండా తిరిగి మంత్రి అయ్యారు. అయితే ఈ నియోజకవర్గానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు పేదలకు సంక్షేమ పథకా లు అందిగా తలసాని మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా చేసింది ఏమి లేకపోగా, ఆయన అనుచురుల వ్యవహారశైలి సైతం నియోజకవర్గంతో కొంత వ్యతిరేకతంగా కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో వ్యక్తిగత ఛరిస్మా పెద్దగా లేకపోయినా ప్రభుత్వం పథకాలే ఆ యనను గట్టేక్కించే అవకాశం ఉందన్న అభిప్రాయం ఈ నియోజవర్గం వ్యక్తం అవుతోంది. బిజెపి పరిస్థితి అంతంతా మాత్రమే!
బిజెపి గత 6 నెలల వరకు రాజకీయంగా రాష్ట్రంలో కొంత ఊపు మీద ఉండడంతో దానిని నమ్ముకుని కమలం పార్టీలో చే రిన మర్రి శశీధర్‌రెడ్డి ఆ పార్టీ టికెట్ మీద సనత్‌నగర్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్ గెలవడం, తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారడంతో, మరోవైపు బిజెపి రాష్ట్రం లో అన్యుహా మార్పులు చోటు చేసుకోవడంతో అప్పటి వరకు ఎగిసిపడిన కమలం పార్టీ ఒక్కసారిగి డీలా పడింది. మరో వైపు ఆ యన కుమారుడు అదిత్యారెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో మర్రి శశీధర్‌రెడ్డి ప్రస్తుతం డైలామాలో పడ్డారు.
అయితే సీనియర్ నాయకులంతా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో కేంద్ర బిజెపి అధినాయకత్వం ఆదేశాల నేపథ్యంలో మర్రిశశీధర్‌రెడ్డి సైతం ఇదే నియోజకవర్గం నుంచి బరీలోకి దిగితే ప్రచారంలో తండ్రి కోడుకుల మధ్య ప్రచండ యుద్దం చోటు చేసుకుంటుందా లేక లోపాయికారి ఒప్పందాలతో ఇరు పా ర్టీలు కలిసి ఎవరికో ఒక్కరికి మద్దతును ఇచ్చుకుంటారా అన్న ఆసక్తి ఈ నియోజకవర్గం నెలకొంది.
బలమైన నాయకుడు లేకపోవడం కాంగ్రెస్‌కు శాపం..!
కాంగ్రెస్ కీలక నాయకుడు మర్రి శశీధర్‌రెడ్డి బిజెపిలో చేరడంతో ఈ నియోజక వర్గం కాంగ్రెస్‌కు ఓ బలమైన నాయకుడు అంటూ లేకకుండ పోయ్యారు. గతంలో ఉన్న నేతలు ద్విదీయ శ్రేణి నాయకత్వాని తొక పెట్టడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. అయితే మర్రి శశీదర్‌రెడ్డి తనయుడు మర్రి అదిత్యా రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపి నుంచి ఆయన తండ్రి మర్రి శశీధర్ రె డ్డి సైతం పోటీ చేసే అవకాశం ఉండడంతో తండ్రి కొడుకుల మధ్య ఎన్నికల సం గ్రామం ఏలా ఉండబోనుందోనని ఆ నియోజక వర్గం ప్రజలు ఆ సక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అదిత్యారెడ్డి రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతుండడం, బిఆర్‌ఎస్ నుంచి బలమైన నాయకుడు రంగంలో ఉండడం, ఇటు బిజెపి నుంచి తండ్రి మర్రి శశీధర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉండడంతో అదిత్యా రెడ్డికే కాంగ్రెస్ టికెట్ ఖరారైతే ఏమేరకు నెట్టుకు రాగలరనేది కాలమే నిర్ణయించనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.