- Advertisement -
హైదరాబాద్: నగరంలో కుండపోత వానలు పడుతుండడంతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నాలాలు అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయన్నారు. నాలాల వద్ద ఆక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని చెప్పారు. ఈ ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే వారికి నష్టపరిహారం కూడా ఇస్తామని పేర్కొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, హుస్సేన్ సాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేసినట్లు తెలిపారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నపథ్యంలో రానున్న వారం రోజులపాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.
- Advertisement -