Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం: తలసాని

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి తలసాని ఓ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”రాష్ట్రంలో బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాబోతోంది. సిఎం కెసిఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. ఊహకందని మెజారిటీని కామారెడ్డి ప్రజలు కెసిఆర్ కు ఇవ్వాలి. రూ.8కోట్లతో కామారెడ్డిలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తాం. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ చేతులెత్తేసింది. కామారెడ్డి రూపురేఖలు రెండుమూడు నెలల్లో పూర్తిగా మారబోతున్నాయి. మాటలతో ప్రజలను బిజెపి నాయకులు మభ్య పెడుతున్నారు” అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News