Friday, December 20, 2024

కాంగ్రెస్‌తో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బిఆర్‌ఎస్ పార్టీకి ఏముందని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికే లేదన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన గత్యంతరం గులాబీ పార్టీకి లేదన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ అత్యంత బలమైన పార్టీ అని అన్నారు.

మా పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. సింహం సింగల్‌గానే వస్తుంది అన్నట్లుగా బిఆర్‌ఎస్ కూడా ఒంటరిగానే ఎన్నికలో బరిలోకి దిగుతుందన్నారు. సొంతంగానే రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వానేని ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ విలువలు లేని వ్యక్తి అని….అలాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఆయన మాటల్లో విశ్వసనీయత లేదని విమర్శించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై వాళ్ళ పార్టీ నేతలు ఏమంటున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో ఎంపీగా ఉండి… బిజెపికి ఓట్లు వేయమన్న ఘన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డిదని ఎద్దేవా చేశారు. బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వస్తారా? లేదా? అనేది ఆయనకే తెలియాలని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలు మారిన వాళ్ళు…బిఆర్‌ఎస్ పార్టీ వీడిన వాళ్ళు ఎలా ఉన్నారో ప్రజలు చూస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News