Friday, December 20, 2024

అలా చేస్తే.. దేశవ్యాప్తంగా ఎన్నికలకు టిఆర్ఎస్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. దేశవ్యాప్తంగా ఎన్నికలకు టిఆర్ఎస్ సిద్ధమని మంత్రి తలసాని అన్నారు. ఆదివారం నగరంలోని సనత్‌నగర్‌ బన్సీలాల్‌పేటలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అధికారం ఉందని బిజెపి నేతలు ఏదైనా మాట్లాడతామంటే చెల్లదు. దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదాం.. గెలుపెవరిదో ప్రజలు నిర్ణయిస్తారు. గుజరాత్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదు?. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పకడ్బందీగా కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నాయకులు. కేంద్రం కుట్రలు చేసినా ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు.

Talasani Srinivas Yadav slams BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News