Monday, January 20, 2025

యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని కెెఎల్ఎమ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. యాదవుల ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం అని, వారిని ప్రోత్సహించేలా 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అర్హులైన లబ్ధిదారులు త్వరగా డిడిలు చెల్లిస్తే వారికి కూడా గొర్రెల యూనిట్ లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా యాదవుల పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎంఎల్ఎలుగా, కార్పొరేషన్ చైర్మన్ లుగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇటీవలనే విద్యావంతుడు సుందర్ రాజ్ ను చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు. మీ మీ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించి మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు యాదవుల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించాయని చెప్పారు. కోకాపేట లో 300 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని, 5 కోట్ల రూపాయలను యాదవుల సంక్షేమ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వరంగల్ లో కూడా సంక్షేమ భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Talasani Srinivas Yadav Speech about Yadavs in Hanamkonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News