Sunday, December 22, 2024

నాలాల అభివృద్ధితోనే ముంపు తగ్గింది: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల కుండపోత వర్షాలు కురిసినా హైదరాబాద్ ముంపు సమస్య రాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పల్లె పట్టణ ప్రగతి ద్వారా సాధించిన పురోగతిపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. నాలాల అభివృద్ధితోనే ముంపు సమస్య తీరుతోందని, హైదరాబాద్‌లో స్థిరపడటానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారని ప్రశంసించారు. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెసోళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలను అడుక్కునే వాళ్లుగా మార్చింది కాంగ్రెస్ అని చురకలంటించారు. సిఎం కెసిఆర్ పాలనలో తమకు కొంచెం తెలివి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాంగ్రెస్ వాళ్లకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. పేదలు బాగుపడుతుంటే కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదని, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూమ్ కాలనీ చూసి ఉంటే షాక్ నుంచి బయటకి వచ్చే వాళ్లు కాదన్నారు.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News