Saturday, November 16, 2024

హైదరాబాద్ లో మరో రెండు రోజులు వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసి సిబ్బందిని రంగంలోకి దింపి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పటి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, భారీగా వరద నీరు రావడంతో హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండలా తలపిస్తుంది.

దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మంత్రి తలసాని శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆధ్వర్యంలో అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలో ప్రస్తుత పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. హుస్సేన్ సాగర్‌ నుంచి దిగువకు నీటి విడదుల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలని మంత్రి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News