Sunday, December 22, 2024

మరోసారి ప్రధాని మోడీకి మంత్రి తలసాని స్వాగతం..!

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ పర్యటనకు మరోసారి సిఎం కెసిఆర్ దూరం

ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరికాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అయితే, ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ కు చేరుకోనున్న ప్రధాని మోడీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతం పలకనున్నారు. గతంలో కూడా సిఎం కెసిఆర్, ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు.

మరోవైపు, మోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. మోడీకి మహబూబ్ నగర్ లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు అంటించారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు, కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు.. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News