Thursday, January 23, 2025

భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు

- Advertisement -
- Advertisement -

భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
ఆయనను భయపెట్టడం ఎవరి తరం కాదు
పరేడే గ్రౌండ్ లాంటి సభలు బిజెపికి కొత్త కానీ….టిఆర్‌ఎస్‌కు కాదు
అంతకు రెట్టింపు జనాలతో…ఎన్నో సభలను నిర్వహించిన చరిత్ర మాది
అనవసరంగా సిఎంపై నోరుపారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
బిజెపి నాయకులను హెచ్చరించిన రాష్ట్ర మంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్: భయం అనేది ముఖ్యమంత్రి కెసిఆర్ రక్తంలోనే లేదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమ్మూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. ఆయనను భయపెట్టడం ఎవరి తరం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టి బయటకు వచ్చిన వ్యక్తి అని అన్నారు. అనేక ఉద్యమాలతో రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు సిఎంగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై అనవసరంగా బిజెపి నాయకులు నోరుపారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
సోమవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహంపై సిఎం కెసిఆర్ రెండున్నర గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా వివరించారన్నారు. దీనిపై మోడీగానీ, కేంద్రమంత్రులుగా సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదన్నారు. వారికి ముఖం చెల్లని కారణంగానే రాష్ట్ర బిజెపి నాయకులతో చిల్లరగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. నిజంగా మోడీ దేశం కోసం పరితపించే వ్యక్తి అయితే కెసిఆర్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని వారు నిలదీశారు. అయినా మోడీ హయంలో దేశానికి జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. పైగా అన్ని వర్గాల ప్రజలను నడిరోడ్డుకు ఇడిస్తున్న దుర్మార్గపు పాలనగా వారు అభివర్ణించారు. మోడీ దేశానికి ప్రధాని అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రగతి శీల రాష్ట్రమైన తెలంగాణకు ఎందుకు చేయూత నివ్నరని ప్రశ్నించారు. తెలంగాణ దేశంలో లేదా? అని నిలదీశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ విషయాన్ని బిజెపి నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణను అభివృద్ధి చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రానికి చేయూతను అందించతపోయినా, కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
రాష్ట్రానికి కెసిఆర్‌యే శ్రీరామ రక్ష అని అన్నారు. ఆరు నూరైనా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టిఆర్‌ఎస్ సర్కారే అని మంత్రులు పేర్కొన్నారు. మోడీకి ఫ్యాషన్ (డ్రెస్‌లు మార్చుకోడానికే)లకే పరిమితమై బిజెపియేతర ప్రభుత్వాలపై గొంతు చించుకుంటున్నాడని మండిపడ్డారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించడం కేంద్రం కనీస బాధ్యక అని అన్నారు. దానిని కూడా విస్మరించడం శోఛనీయమని మండిపడ్డారు. ధాన్యం ఏమైనా ఉరికే కొంటున్నారా? అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం అమ్ముకుంటే డబ్బులు రావా? అని వారు ప్రశ్నించారు.
పోడు భూములు, ధరణి అంశాలపై బిజెపి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పోడు భూములపై కేంద్రానికి తీర్మానాన్ని అసెంబ్లీ ద్వారా పంపామన్నారు. దానిపై ప్రధాని ఇప్పటి వరకు ఉలకరు…. పలకరన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కొనసాగుత్ను కిషన్ రెడ్డి ఒక ఎంపిగా సికింద్రాబాద్‌కు కనీసం లక్ష రూపాయలు అయినా తెచ్చారా? అని మంత్రులు ప్రశ్నించారు. మతం రంగు పులమడం తప్ప బిజెపి నాయకులకు మరోటి చేతకాదని విమర్శించారు. యుపితో తెలంగాణను పొలుస్తారా? అక్కడ రోడ్లు, ఆరోగ్యం పరిస్థితి ఏమిటో తెలుసా. అలాంటి పాలన ఇక్కడ కావాలా? అని నిలదీశారు. మోడీ గద్దె దిగాలని దేశమంతా కొరుకుంటోందన్నారు. పైగా మోడీ పాల్గొన్న పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభను చూసి టిఆర్‌ఎస్ భయపడుతోందని బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. అలాంటి సభలు ఆ పార్టీకి కొత్త కానీ, టిఆర్‌ఎస్‌కు కాదన్నారు. అంతకు రెట్టింపు జనాలతో నిర్వహించిన బహిరంగ సభలు టిఆర్‌ఎస్‌కు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు. అనవసరంగా హద్దులు దాటి.. మా సహనాన్ని పరీక్షించొద్దు అని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
బోనాల పండగకు ప్రభుత్వం రూ.15కోట్ల రూపాయలు కేటాయించామని… మరి బిజెపి పాలిత రాష్ట్రాల్లో అలా కేటాయించారా? అని ప్రశ్నించారు. అయినా ఈ లొల్లి పంచాయితీ ఎందుకు… ఢిల్లీకి వెళ్లి మోడీని పార్లమెంట్ రద్దు చేయాలని ఒప్పించాలని…తాము కూడా అసెంబ్లీ రద్దుకు కెసిఆర్‌ను ఒప్పిస్తామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Talasani Srinivas Yadav Warns BJP Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News