- Advertisement -
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటిస్తున్నారు. శేరిగూడాలో 2 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులతో పాటు 1.85 కోట్లు వ్యయంతో నాగార్జున సాగర్ పిడబ్ల్యుడి రోడ్డు నుంచి ఉప్పరిగూడ బిటి రోడ్డు నిర్మాణ పనులను ఎంఎల్ఎ కిషన్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి ఉచిత చేప పిల్లల పంపిణీని మంత్రి తలసాని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 26,357 నీటి వనరుల్లో రూ.84.13 కోట్లతో 85.60 కోట్ల చేప పిల్లలను, 300 నీటి వనరుల్లో రూ.25.99 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తోంది.
Also Read: దేవరకద్రలో ప్రియుడిని నరికిన ప్రియురాలి భర్త
- Advertisement -