Friday, November 15, 2024

లబ్ధిదారులకు గొర్రెల పంపిణీకి చర్యలు: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిడిలు చెల్లించిన లబ్ధిదారులకు వెంట వెంటనే గొర్రెల యూనిట్ ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అన్ని జిల్లాల పశు వైద్యాధికారులతో మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి మంత్రి తలసాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల యూనిట్ ధర 1.25 లక్షల నుండి 1.75 లక్షలకు ముఖ్యమంత్రి కెసిఆర్ పెంచినట్లు చెప్పారు. పెరిగిన లబ్ధిదారుల వాటాపై గ్రామ సభల ద్వారా వివరించి సేకరించాలని డివిహెచ్ఒలను మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాలలో గొర్రెల మార్కెట్ ల నిర్మాణానికి కలెక్టర్ ల సహకారంతో భూమి సేకరించాలని చెప్పారు. కృత్రిమ గర్భధారణ, వ్యాక్సిన్ పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. కార్యక్రమాల అమలులో గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో జీవాల సంఖ్య పెరగడంతో హాస్పిటల్స్ కు డిమాండ్ పెరుగుతుందన్నారు.

Talasani video conference Animal husbandry officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News