Tuesday, January 21, 2025

నేషనల్ ఫెడరేషన్ కప్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు తమ ప్రతిభను మరోసారి చాటారు. ఈ నెల 4,5 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్‌లో జరిగిన ఫెసపెల్లో నేషనల్ ఫెడరేషన్ కప్‌లో తెలంగాణ టీమ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఘనతను చాటిన మన రాష్ట్ర టీమ్‌కు రాష్ట్ర కోచ్ విశాల్, అసోసియేషన్ ప్రతినిధులు ఏ.మయూరీ, ఎన్. శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 7 రాష్ట్రాల జట్లు ఇందులో పాల్గొనగా నాకౌట్ లీగ్ పద్దతిలో జరిగిన మ్యాచ్‌ల్లో పలు ఇతర రాష్ట్రాల టీమ్స్‌పై గెలిచి తెలంగాణ ఫెసపెల్లో టీమ్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచి కప్‌ను కైవసం చేసుకోగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం రన్నర్ అప్ స్థానాన్ని దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News