- Advertisement -
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సమాచార మీడియా కేంద్రం అధిపతినిఇ తాలిబన్లు శుక్రవారం కాల్చిచంపారు. ఆఫ్ఘన్ ఆపద్ధర్మ రక్షణ మంత్రిపై హత్యాయత్నం జరిగిన కొద్ది రోజులకే ఒక ప్రభుత్వ అధికారిని తాలిబన్లు హతమార్చడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వం తరఫున స్థానిక, విదేశీ మీడియాకు సమాచారం అందచేసే బాధ్యతలు చూస్తున్న ప్రభుత్వ మీడియా కేంద్రం అధిపతి దావా ఖాన్ మేనాపాల్‌ను తాలిబన్లు హతమార్చినట్లు తాలిబన్ ప్రతినిధి జమీనుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపారు. ముజాహిదీన్ జరిపిన ప్రత్యేక దాడిలో మేనాపాల్ మరణించారని, ఆయన చేసిన తప్పులకు శిక్ష పడిందని ముజాహిద్ తెలిపారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ పూర్తిగా జరిగిన తర్వాత కొద్ది నెలలుగా తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
- Advertisement -