Friday, November 15, 2024

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ తాలిబన్ల దాడి

- Advertisement -
- Advertisement -

Taliban attack again at Kabul airport

 

కాబూల్ : కాబూల్ ఎయిర్ పోర్టును లక్షంగా చేసుకుని సోమవారం ఉదయం మళ్లీ రాకెట్ల దాడి జరిగింది. అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చివేయడమైంది. లాబ్ జార్ ఖైర్ఖానా లోని ఖోర్‌షిడ్ ప్రైవేటు యూనివర్శిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లు ప్రయోగించినట్టు తెలిసింది. ఎయిర్ పోర్టులో ఉన్న క్షిఫణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతిదాడి చేయడంతో అవి విమానాశ్రయ సమీపం లోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయాయి. అయితే రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. వీటి పేలుడు శబ్దాలతో ఎయిర్ పోర్టు వద్ద ఉన్న అఫ్గాన్ పౌరులు భయాందోళనలతో పరుగులు తీశారు. మొత్తం ఐదు రాకెట్లు ప్రయోగించినట్టు స్థానిక మీడియా కథనాల సమాచారం. ఆదివారం కూడా ఈ ఎయిర్‌పోర్టు వద్ద ఇలాంటి దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయానికి వాయువ్య దిశలో కేవలం ఒక కిమీ దూరంలో ఖువ్జా బుమ్రా ప్రాంతంలో రాకెట్ దాడి జరిగింది. ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. మరోవైపు ఆదివారం కాబూల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా భగ్నం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News