Tuesday, November 5, 2024

అఫ్ఘన్‌లో కో-ఎడ్ నిషేధం

- Advertisement -
- Advertisement -

Taliban Ban Co-education in Afghanistan's Herat

సమాజంలోని అన్ని దుర్మార్గాలకు
ఇదే మూలమని తాలిబన్ల వ్యాఖ్య

మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా తొలి చర్య
సోషల్ మీడియాను తాకేందుకే జంకుతున్న మహిళలు
ఇళ్లలో లైట్లు ఆర్పి తాలిబన్ల కంట పడకుండా జాగ్రత్తలు
భోజనం రుచిగా వండలేదని నిప్పంటిచి మహిళ దారుణ హత్య
శవపేటికల్లో మహిళల తరలింపు, సెక్స్ బానిసలుగా మార్పు
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రకటనలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న తాలిబన్లు

కాబూల్: అఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అందరూ భయపడుతు న్న విధంగానే మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కో ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వా జారీ చేశారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తావే లేదని, అంతా షరియత్ చట్టాల ప్రకారమేనని ఇ ప్పటికే తేల్చి చెప్పిన తాలిబన్లు ఆ వైపుగా నే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజా గా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ, ప్రైవే టు విశ్వవిద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులకే తాలిబన్లు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వి శ్వవిద్యాలయాల్లో ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకోవడాన్ని నిషేధించా రు. అంతేకాదు ‘ సమాజంలోని అన్ని దు ర్మార్గాలకు అదే మూలం’ అని అభివర్ణించ డం గమనార్హం. వర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేటు సంస్థల యజమానులు, తాలిబ న్ అధికారుల మధ్య సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖామా ప్రెస్ న్యూస్ ఏజన్సీ శనివారం తెలియజేసింది.

అఫ్ఘన్ ఉన్నత విద్యకు చెందిన తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడు గంటల పాటుఈ సమావేశం నిర్వహించారు. కో ఎడ్యుకేషన్‌ను నిలిపి వేయాల్సిందేనని, వే రే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశా రు. అలాగే మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతి ఉంటుంది తప్ప పురుషులకు బోధించే అవకాశం ఉండదని కూడా స్పష్టం చేశారు. కాగా గత రెండు దశాబ్దాలలో అఫ్ఘన్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్లలో కో ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ప్రత్యేక తరగతుల మిశ్రమ విద్యావ్యవస్థను అమలు చేశారు. అధికారుల అంచనా ప్రకారం హెరాత్‌లో ప్రైవేటు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కాలేజిల్లో 40 వేల మంది విద్యార్థులు, 2 వేలకు అధ్యాపకులు ఉన్నారు. తాలిబన్లు గమనిస్తున్నారన్న భయంతో మహిళలు సోషల్ మీడియాను సైతం ఉపయోగించడం లేదు. రోడ్లపై ఏం జరుగుతుందో చూడడానికి కూడా భవంతుల్లోని బాల్కనీల్లో నిలుచోవడానికి సైతం వెనకాడుతున్నారు.

నివాసాల్లో లైట్లు ఆర్పేసి ఇళ్లకే పరిమితమవుతూ పిల్లలను సైతం బయటికి రానివ్వడంలేదు. పిల్లలు పెద్దగా ఏడుస్తున్నా అదిమిపడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. భోజనం రుచిగా వండలేదని ఓ మహిళకు నిప్పంటించి తాలిబన్లు దారుణంగా హతమార్చినట్లు మాజీ న్యాయమూర్తి ఒకరు తెలిపారు. మరోవైపు సరియైన సరఫరా లేక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కొనే పరిస్థితి లేకపోతే కొద్ది రోజుల్లో ఆకలి చావులు చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. జిహాదీలను వివాహమాడాలని యువతులను తాలిబన్లు బలవంతానికి గురిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. మహిళలను శవపేటికల్లో తరలించి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని సచారం. మైనారిటీ వర్గానికి హజారాలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికే పదుల సంఖ్యలో వారిని హతమార్చారని అమ్నెస్టీ ప్రకటించింది. మహిళా హక్కులకు భంగం కలిగించబోమంటూనే తాలిబన్లు దాడులకు పాల్పడుతున్నారని, ప్రతీకార చర్యలు ఉండవంటూనే పాత్రికేయులు, పలువురు దౌత్య సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

కాబూల్ చేరుకున్న తాలిబన్ అగ్రనేత బరాదర్

అఫ్ఘనిస్థాన్‌లో ‘అన్ని వర్గాలతో కూడిన’ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వివిధ వర్గాలతో చర్చలు జరిపేందుకు తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ శనివారం కాబూల్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ కీలక నేతలు కూడా ఇటీవలి రోజుల్లో కాబూల్‌లో కనిపించారు. వారిలో అమెరికా మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరైన ఖలీల్ హక్కానీ ఉన్నారు. హక్కానీ తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. హక్కానీ ఒకప్పటి తన బద్ధ శత్రువైన గుల్బద్దీన్ హెక్మతియార్‌ను కలిసిన వార్తలు కూడా తాలిబన్ అనుకూల సోషల్ మీడియాలో వచ్చాయి. 1990 దశకం ప్రారంభంలో అప్ఘన్‌లో జరిగిన దారుణ దారణ అంతర్యుద్ధ సమయంలో వీరిద్దరూ బద్ధ శత్రువులు.

కాగా ఇప్పటికీ హెక్మతియార్‌కు అఫ్ఘన్ రాజకీయాల్లో మంచి పలకుబడే ఉంది. కాగా అన్ని వర్గాలతో కూడిన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బరాదర్ జిహాదీ నేతలను, రాజకీయ నాయకులను కలుసుకుంటారని తాలిబన్ సీనియర్ నేత ఒకరు ఎఎఫ్‌పి వార్తా సంస్థకు చెప్పారు. బరాదర్ గత మంగళవారమే ఖతర్‌నుంచి తాలిబన్ ఆధ్యాత్మిక జన్మస్థలమైన కాందహార్‌లోకి అడుగు పెట్టారు. ఆయన నగరంలో అడుగుపెట్టిన కొద్ది గంటలకే తాలిబన్లు ఈ సారి తమ పాలన గతంకన్నా భిన్నంగా ఉంటుందని ప్రకటించడం గమనార్హం. 2010లో పాకిస్థాన్‌లో అరెస్టయిన బరాదర్ అమెరికానుంచి ఒత్తిడి వచ్చేదాకా వారి కస్టడీలోనే ఉన్నారు. అమెరికా ఒత్తిడి కారణంగా బరాదర్‌ను 2018లో పాక్ వదిలిపెట్టగా ఆయన అప్పటినుంచి ఖతర్‌లో ఉంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News