Wednesday, November 6, 2024

నిరసన ర్యాలీపై తాలిబన్ల కాల్పులు

- Advertisement -
- Advertisement -
Afghan Independence Day Rally Killed Taliban Firing

 

అసాదాబాద్‌లో రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు

కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జలాలాబాద్‌లో బుధవారం జాతీయ జెండా విషయంలో నిరసన తెలిపిన వారిపై తాలిబన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గురువారం కూడా స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీలో జాతీయ పతాకంతో నిరసన తెలుపుతున్న వారిపై తాలిబన్లు జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కునార్ ప్రావియన్స్ రాజధాని అసాదాబాద్ నగరంలో గురువారం ఈ సంఘటన జరిగింది. నిరసనకారుల్లో మగవారితో పాటుగా మహిళలు కూడా కొందరు ఉండడం గమనార్హం. ఆందోళన చేస్తున్న వారు తాలిబన్ల జెండాలను చించేసి అప్ఘన్ జాతీయ పతాకాలను ఊపుతూ ‘ మా జెండా, మా గుర్తింపు’ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.

1919లో బ్రిటీష్ పాలననుంచి స్వాతంత్య్రం పొందినందుకు గుర్తుగా అఫ్ఘన్లు గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొటున్నారు. ఈ క్రమంలోనే వారంతా తాలిబన్ల పతాకాలకు బదులు అఫ్ఘాన్ జాతీయ పతాకాలను ఎగురవేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించిన వారు అధిక సంఖ్యలో ఉండే తూర్పు పాకిస్థాన్‌లోని పట్టణాల్లోనే తాలిబన్ల పాలనకు వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతుండడం గమనార్హం. ఈ నిరసన ప్రదర్శలను తాలిబన్లు ఎలా అణచివేస్తారనే దానిపైనే అఫ్ఘన్లు వారి పాలనను ఎంతమేరకు ఆమోదిస్తున్నారనేది ఆధారపడి ఉంది. గురువారం ఉదయం అసాదాబాద్‌లో ఆందోళనకారులు తాలిబన్లకు వ్యతిరేకంగా జాతీయ జెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. అయితే అదే సమయంలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. దీంతో మరణాలు కాల్పుల వల్ల జరిగాయా, లేక తొక్కిసలాట వల్లనా అనేది తెలియదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అసాదాబాద్‌లో వందల మంది రోడ్ల్లపైకి వచ్చి నిరసన తెలిపినట్లు ఆ వ్యక్తి చెప్పారు.

తీవ్ర ఆహార కొరత

అఫ్ఘన్ జాతీయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో మూడు వంతుల ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతోంది. దీనికి తోడు కరోనా వ్యప్తి తీవ్రంగా ఉండడం.. వ్యాక్సిన్ల లభ్యత తగ్గిపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరాయి. తాజాగా తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టడంతో వారి పరిస్థితి పెనంపైనుంచి పొయ్యిలో పడినట్లయింది. ఇప్పటికే పోలియో టీకాలను వ్యతిరేకిస్తున్న తాలిబన్లు కరోనా టీకాలనుకూడా దేశంలోకి రానివ్వరేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు తీవ్ర కరువుతో అల్లాడుతున్న దేశంలోని 3.8 కోట్ల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని, విదేశాలనుంచి దిగుమతి చేసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉన్న వీరంతా ఇప్పుడు తాలిబన్ల పాలనా కారణంగా విదేశాలనుంచి అందే సాయం ఆగిపోయి ఆకలితో అల్లాడాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చని ఐక్య రాజ్య సమితికి చెందిన అధికారి ఒకరు హెచ్చరిస్తున్నారు.

కరోనా భయం

దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ఉంటే ఈ ఏడాది జులై వరకు 5 లక్షలు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో లక్షా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నెల 13 వరకు ఇక్కడ ఏడు వేల మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. ఈ లెక్కలు ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలే ఉన్నాయి. మరో వైపు ఇప్పటివరకు అఫ్ఘన్‌లో 18 లక్షల డోసులు కొవిడ్ టీకాలను మాత్రమే పంపిణీ చేశారు. కాగా గతంలో పోలియో వ్యాక్సిన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన తాలిబన్లు ఇప్పుడు కొవిడ్ టీకాలను అనుమతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

taliban fire on protest rally in afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News