ఇస్లామాబాద్: తమ బందీలుగా ఉన్న 27 మంది తిరుగుబాటుదారులను తాలిబన్లు గత నెల అఫ్ఘానిస్తాన్‌లోని పంజ్‌సిర్ లోయలో కాల్చి చంపినట్లు మంగళవారం ఒక అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. తమతో జరిగిన యుద్ధంలో ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారులు చనిపోయారంటూ తాలిబన్లు గతంలో చేసిన వాదనను ఆ సంస్థ తన నివేదికలో తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను లండన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిసిలియన్స్ విడుదల చేసింది. ఐదుగురు బందీల కళ్లకు గంతలు కట్టి, వారి చేతులను వెనుకకు కట్టివేసి తుపాకులతో గుళ్ల వర్షం కురిపించి తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ప్రతిపక్ష శక్తులు, వారి మద్దతుదారుల పట్ల తాలిబన్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారనడానికి అనేక సాక్షాలు లభించాయని ఆ సంస్థ తెలిపింది. 2021 ఆగస్టులో అఫ్ఘాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ఒత్తిడి చేస్తున్న తాలిబన్లు ప్రజలు, ప్రతిపక్షాలు, తిరుగుబాటుదారుల పట్ల అత్యంత కిరాతకంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది.
27 మంది బందీలను హతమార్చిన తాలిబన్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -