Sunday, January 12, 2025

ఆత్మాహుతి బాంబు దాడి.. తాలిబన్ల మంత్రి ఖలీల్ మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ల శరణార్థుల తాత్కాలిక మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కనీ బుధవారం రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి బాంబుదాడికి ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మరో ఆరుగురు మృతి చెందారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు ఈ దాడికి పాల్పడిందని తాలిబన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకు ఆ మిలిటెంట్ గ్రూపు ప్రకటించలేదు.

అఫ్గానిస్థాన్ నుంచి 2021లో విదేశీ బలగాలు వైదొలగిన తరువాత ఏర్పడిన తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వంలో శరణార్థుల మంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. బుధవారం మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. హక్కనీ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర వహించిన ఖలీల్‌ఉర్ రహ్మాన్ మృతికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News