Saturday, November 23, 2024

తాలిబన్ల నేతలతో చైనా, రష్యా, పాక్ దూతల చర్చలు

- Advertisement -
- Advertisement -

Taliban Official Says Acting PM Meets With Russian

బీజింగ్ /కాబూల్ : రష్యా, చైనా, పాకిస్థాన్ ప్రత్యేక దూతలు బుధవారం తాలిబన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అఫ్ఘన్ ప్రముఖ నేతలు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్లుల్లాలను కూడా కాబూల్‌లో కలుసుకున్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు దిశలో ఈ వేర్వేరు సమావేశాలు జరిగాయి. సమగ్ర ప్రభుత్వం ఏర్పాటు, ఇదే సమయంలో ఉగ్రవాదం తలెత్తకుండా చూడటం, మానవీయ పరిస్థితులు ఉండేలా చూసుకోవడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని చైనా ఉన్నతాధికారి ఒకరు ఆ తరువాత తెలిపారు. తాత్కాలిక ప్రధాని మెహమ్మద్ హసన్ అఖుంద్, విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ, ఆర్థిక మంత్రి, తాత్కాలిక ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులతో ఈ దేశాల దూతలు సమావేశం అయ్యారు. తమకు తగు విధంగా గుర్తింపు ఇచ్చిన రష్యా, చైనా, పాకిస్థాన్‌లు ప్రత్యేకించి చైనా పట్ల తాలిబన్లు విధేయత చూపుతున్నారు. పూర్తి స్థాయి ప్రభుత్వ ఏర్పాటు సవ్యంగా ఉండేలా చేసుకుంటెనే అంతర్జాతీయ స్థాయిలో తాలిబన్ల సర్కారుకు, తాలిబన్లకు గుర్తింపు ఉంటుందని ఈ దేశాల దూతలు స్పష్టం చేసినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News