Monday, December 23, 2024

మహిళా నిరసనకారులపై తాలిబన్ల దాడి

- Advertisement -
- Advertisement -

Taliban Opens Fire on women protesters

కాబూల్ : తినడానికి తిండి, చేయడానికి పని కావాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన 40 మంది మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు. గాలి లోకి కాల్పులు జరుపుతూ భయభ్రాంతుల కు గురి చేశారు. చెల్లాచెదురైన మహిళలను వెంటాడి మరీ కొట్టారు. ప్రాణభయంతో సమీపం లోని దుకాణాలలో తలదాచుకొన్న కొందరు మహిళలపై తుపాకీ గొట్టాలతో దాడి చేశారు. ఉపాధి , స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఆగస్టు 15 బ్లాక్‌డే అనే నినాదంతో ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. తాలిబన్ల అజ్ఞానంతో తాము విసుగెత్తి పోయామని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న పాత్రికేయుల్ని కూడా తాలిబన్లు వదిలిపెట్టలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News