Saturday, December 21, 2024

ముఖం చాటు ముచ్చట్లు

- Advertisement -
- Advertisement -

Taliban order women TV anchors to cover their faces

లేడి యాంకర్లకు తాలిబన్ షాక్

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో మహిళా టీవీ యాంకర్లు ముఖాలు కన్పించకుండా ముసుగు వేసుకోవాని తాలిబన్లు ఆదేశించారు. దేశంలో ప్రత్యేకంగా ఏర్పాటైన విలువల పరిరక్షణ, అవలక్షణాల దిద్దుబాట్ల మంత్రిత్వశాఖ పేరిట ఈ తాఖీదులను దేశంలోని అన్ని టీవీ ఛానళ్లకు పంపించారు. దీనితో ఇక మహిళా యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖం ప్రేక్షకులకు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ముఖం కప్పి ఉండేలా కేవలం కళ్లు కనబడేలా ముఖానికి వస్త్రం అమర్చుకోవాలి. తమ ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా చేసేందుకు పలు ఏర్పాట్లు కూడా చేశారని టోలో న్యూస్ ఛానల్ ఓ ట్వీటులో తెలిపింది. ఇప్పటికే మహిళా యాంకర్లు ముఖం చాటేసుకుని వార్తలు ఇతర కార్యక్రమాలను సమర్పిస్తున్నప్పటి తమ ఫోటోలను సామాజిక మాధ్యమంలో ఎటువంటి కామెంట్లు లేకుండా వెలువరించారు. తమకు కూడా తాలిబన్ సర్కారు నుంచి ఇటువంటి ఆదేశాలు వెలువడ్డాయని అఫ్ఘన్ స్థానిక మీడియా ఒకటి తెలిపింది. అయితే దీనిపై చర్చకు కానీ వ్యాఖ్యకు కానీ వీల్లేదని తాము దీనిని పాటించడం తప్ప మరోటి లేదని అక్కడి అధికార ప్రతినిధి ఒకరు తన ముఖం కన్పించకుండా చేసుకుని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News