కాబూల్: మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్న అఫ్ఘాన్‌లోని తాలిబన్ పాలకులు మంత్రిత్వశాఖను తొలగించి దాని స్థానంలో కొత్త మంత్రిత్వశాఖను పూర్తిగా పురుషులతో భర్తీచేశారు. ఇస్లాం మతసూత్రాలకు సొంత భాష్యం చెప్పుకుంటున్న తాలిబన్లు 1990 దశకంలో మహిళలపై విధించిన కఠిన ఆంక్షలనే తిరిగి అమలుచేసే దిశలో మరో అడుగు ముందుకేశారు. మహిళలకు సంబంధించి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ తమ దృష్టికి రాలేదని తాలిబన్ ప్రభుత్వంలోని వర్గాలు తెలియచేశాయి. కాగా..అఫ్ఘాన్ మహిళల ఆర్థిక సాధికారత, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం కోసం 10 కోట్ల అమెరికన్ డాలర్ల నిధితో ఏర్పాటు చేసిన ప్రపంచ బ్యాంకు నిధికి చెందిన ఉద్యోగులను శనివారం తాలిబన్ ప్రభుత్వం పంపించివేసింది. ఈ కార్యక్రమం కొనసాగుతుందో లేదో తాను చెప్పలేనని ప్రపంచ బ్యాంకు కార్యక్రమానికి చెందిన సభ్యుడు షరీఫ్ అఖ్తర్ విలేకరులకు తెలిపారు.
మహిళా మంత్రిత్వశాఖను రద్దు చేసిన తాలిబన్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -