Friday, February 28, 2025

90 వేల కెమెరాలతో తాలిబన్ల నిఘా

- Advertisement -
- Advertisement -

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో స్థానికంగా అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో రాజధాని కాబూల్‌లో 90 వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరాల నిరోధానికే ఈ చర్యలు తీసుకున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. అయితే పౌరులపై కఠిన ఆంక్షల అమలు పర్యవేక్షణ కోసం వీటిని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబూల్ జనాభా 50 లక్షలు కాగా, తాలిబన్ల పాలన మొదలైన తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడం, వస్త్రధారణ, వినోదం సహా చిన్నారుల విద్యపైనా ఆంక్షలు విధించారు. కీలక నగరాల్లో సీసీ కెమెరాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News