Friday, November 1, 2024

డిఎస్‌సి-98 క్వాలిఫైడ్లకు త్వరలో న్యాయం జరిగేలా సిఎంతో మాట్లాడతా

- Advertisement -
- Advertisement -
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ

హైదరాబాద్ : డిఎస్‌సి-98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేసే విషయమై సిఎం కెసిఆర్‌కు ఇటీవల ‘నోట్ ఫైల్‘ పెట్టి మాట్లాడానని, వారి నుంచి అధికారిక నిర్ణయం వెలువడిన వెంటనే త్వరితగతిన అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పంజగుట్ట శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసంలో 1998 డిఎస్‌సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఉపేందర్ బృందం కలిసింది. సిఎం కెసిఆర్‌తో మాట్లాడి డిఎస్‌సి-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను త్వరగా పరిష్కరించాలని విద్యా శాఖ మంత్రిని వారు అభ్యర్థించారు. వినతిపత్రం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి డిఎస్‌పి-98 అభ్యర్థులు 4,072 మందికి రెండు నెలల క్రితం ఉద్యోగాలిచ్చి అక్కడి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. మిగిలిపోయిన 2,400 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా త్వరలోనే ఉద్యోగాలిచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయం విద్యా శాఖకు ఒక లేఖను పంపించగా త్వరలోనే వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని తెలియజేశారు. 60 సంవత్సరాల వయోపరిమితితో ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల్లోకి తీసుకున్న వారికి 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు అమలు, 12 నెలల వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విద్యా శాఖకు తాజాగా వెలువడ్డాయని శ్రీనివాస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1998 మెగా డిఎస్‌సిలో క్వాలిఫైడ్ అభ్యర్థులుగా మిగిలిపోయామని, జనవరి 3, 2016 న సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని శ్రీనివాస్ వివరించారు. మంత్రి సబిత మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నుంచి నిర్ణయం వెలువడిన వెంటనే డిఎష్‌సి-98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఎలాంటి జాప్యం జరుగకుండా త్వరితగతిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1500 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని మంత్రి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయిందని, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నదన్న తీవ్ర ఆందోళనలో డిఎస్‌సి -98 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేయగా సిఎం కెసిఆర్‌తో త్వరలోనే మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మంత్రి సబిత హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News