Thursday, January 23, 2025

కాంగ్రెస్‌తో పొత్తుపై తుది దశలో చర్చలు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పొత్తు ప్రకటన వెలువడతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ఆప్ పునఃపరిశీలించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాలలో పొత్తులకు సంబంధించి చర్చలు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలో ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో పొత్తు చర్చలు జరుగుతున్నట్లు కేజ్రీవాల్ గతంలో ప్రకటించారు. పంజాబ్‌లో ఆప్ ఒంటరి పోరుకు సంబంధించి ప్రశ్నించగా అది విజయం కోసం అమలు చేస్తున్న వ్యూహమని ఆయన సమాధానమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News