Wednesday, January 22, 2025

ఆరడుగుల బుల్లెట్ ఆంబోతు రోమియో గిన్నిస్‌రికార్డు

- Advertisement -
- Advertisement -

ఆరడుగుల ఆంబోతు గిన్నిస్‌లోకి దూకుడుగా చేరింది. రోమియో ముద్దుపేరైన ఈ ఆంబోతు ఎత్తు 6 అడుగుల నాలుగున్నర అంగుళాలు. అమెరికాలోని ఒరేగాన్‌లోని ఓ పశుకేంద్రంలో ఉంటూ రాజరికం ఒలకబోస్తోంది. ఆరు సంవత్సరాల ఈ హోలెస్టెయిన్ జాతి ఎద్దు అత్యంత ఎతైన ఎద్దు అని నిర్థారించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో రోమిమో తన స్థానం దక్కించుకుంది. ఇంతకు ముందటి వరల్డ్ రికార్డు ఎద్దు టామీ ఎత్తును ఈ రోమియో 3 అంగుళాలు మించిపోయి తానే నెంబరు 1 అయింది. తన రోమియో చూడటానికి భారీ కాయంగా ఉన్నా, తనకు పసిదానిగానే అన్నిస్తుందని,

ఇది పెద్ద సాఫ్టీ అని ఓనర్ మిస్టీ మూరే తెలిపారు. మీటర్లలో చెపితే ఈ ఆంబోత్తు ఎత్తు దాదాపు రెండు మీటర్ల వరకూ ఉంటుంది. ఇక దీని ఇష్టమైన ఆహారం ఎక్కువగా పండ్లు వీటిలోనూ ఆపిల్స్, అరటి పండ్లు లాగించివేస్తుంది. రోజుకు 45 కిలోల వరకూ ఆహారం అవసరం అని, ఇందులో దీనికి తవుడు, గింజలు వంటివి కూడా కలిపి ఇస్తుంటామని వివరించారు. దీనిని ఎక్కడికైనా తీసుకువెళ్లాలంటే ప్రత్యేక వాహనం అవసరం. ఇక దీనిని కట్టి ఉంచడానికి సరైన ఏర్పాట్లతో షెడ్ అవసరం అని, ఎన్ని కష్టాలైనా ఇది తమకు అపురూపమని దీని ఓనర్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News