Tuesday, January 21, 2025

‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ బోల్తా

- Advertisement -
- Advertisement -

Tallibidda Express overturn

పాయకరావుపేట/నక్కపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనం బోల్తాపడింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట-పాయకరావుపేట మండలం నామవరం మధ్య ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన వాహనాల్లో ఒకటి శుక్రవారం సాయంత్రం ఒడ్డిమెట్ట వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ క్రమంలో అదుపుతప్పి.. డివైడర్‌పైకి ఎక్కి రోడ్డుపై బోల్తా పడింది. వాహనం డ్రైవర్‌ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కోలుగు గ్రామానికి చెందిన మణికంఠ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు తీయించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఈ సంఘటపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ డి.వెంకన్న చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News